న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది.
దేశవ్యాప్తంగా కంపెనీకివున్న రెండు ప్లాంట్లలో పనిచేస్తున్న కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ వీఆర్ఎస్కు 100 మంది ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు.