Volvo XC40 Recharge | ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా (Volvo Cars India) భారత్ మార్కెట్లోకి వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ ఎలక్ట్రిక్ కారు (Volvo XC40 Recharge) సింగిల్ మోటార్ వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.54.95 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. ట్విన్ మోటార్ వేరియంట్ వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ (Volvo XC40 Recharge) రూ.57.90 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది.
దీంతో వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ ఎలక్ట్రిక్ కారు (Volvo XC40 Recharge) మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ సింగిల్ మోటార్, వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ ట్విన్ మోటార్, వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ ట్విన్ మోటార్ వేరియంట్లలో లభిస్తుంది. ఇక వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. 2022లో వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ ఎలక్ట్రిక్ కారును వోల్వో ఇండియా ఆవిష్కరించింది. కస్టమర్ల బేస్ పెంచుకోవడానికే వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ ఎలక్ట్రిక్ కారును (Volvo XC40 Recharge) ఆవిష్కరించినట్లు తెలిపింది.
వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జీ ఎలక్ట్రిక్ కారు (Volvo XC40 Recharge) సింగిల్ మోటార్ 69 కిలోవాట్ల లిథియం ఐయాన్ బ్యాటరీతో వస్తున్నది. ఈ మోటార్ గరిష్టంగా 238 హెచ్‌పీ విద్యుత్, 420 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. కేవలం 7.3 సెకన్లలో 100 కి.మీ వేగం పుంజుకుంటుంది. సింగిల్ చార్జింగ్ చేస్తే డబ్ల్యూఎల్టీపీ ప్రమాణాల ప్రకారం 475 కి.మీ, ఐసీఏటీ టెస్టింగ్ పరిస్థితుల ప్రకారం 592 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
వోల్వో ఎక్స్ సీ40 రీచార్జి సింగిల్ మోటార్ కారుపై ఎనిమిదేండ్ల బ్యాటరీ వారంటీ, మూడేండ్ల కాంప్రహెన్సివ్ వారంటీ అందిస్తుంది. మూడేండ్లపాటు సర్వీస్ ప్యాకేజీ, మూడేండ్లు రోడ్ సైడ్ అసిస్టెన్స్, డిజిటల్ సర్వీసుల కోసం ఐదేండ్ల సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.