ముంబై, జూలై 10: దేశీయ మార్కెట్లో అడుగుపెట్టి నాలుగేండ్లు పూర్తైన సందర్భంగా వర్చ్యూస్ మాడల్‌పై ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు ఫోక్స్‌వ్యాగన్ ప్రకటించింది. 2022లో దేశీయ రోడ్లపైకి అడుగుపెట్టిన ఈ మాడల్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించిందని, ప్రతి 24 నిమిషాలకు ఒక మాడల్ అమ్ముడైందని పేర్కొంది.
ఈ సందర్భంగా కొనుగోలుదారులకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం కొనుగోలు చేయండి..చెల్లింపులు తర్వాత చేయండి అనేదానితోపాటు లాయల్టీ ప్రయోజనాలు, ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్లు, అలాగే డాక్టర్లు, సీఏలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ తెలిపారు. డిజైన్, స్పేసియస్ క్యాబిన్, టీఎస్ఐ ఇంజిన్, ప్రీమియం సెడాన్‌లో భద్రతా ఫీచర్లకు పెద్దపీట వేసినట్టు చెప్పారు.