Vodafone Idea | న్యూఢిల్లీ, జూలై 11: వచ్చే ఏడాది సెప్టెంబర్లో చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయి కోసం పెట్టిన రూ.24,747 కోట్ల బ్యాంక్ గారెంటీని రద్దు చేయాలని టెలికం శాఖను వొడాఫోన్ ఐడియా కోరినట్టు సమాచారం. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఈ ప్రైవేట్ రంగ టెలికం సంస్థ కూరుకుపోయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇంత భారం తమపై మోపవద్దని టెలికం శాఖ వద్ద వొడాఫోన్ ఐడియా మొర పెట్టుకున్నట్టు పీటీఐకి సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా, స్పెక్ట్రమ్ వేలం నిబంధనల ప్రకారం గడువు తేదీకి ఏడాది ముందే చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంక్ గ్యారెంటీగా డిపాజిట్ చేయాల్సి ఉన్నది. ఇటీవలి వేలంలో వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ కొన్న విషయం తెలిసిందే.