హైదరాబాద్, మే 13: హైదరాబాద్‌లో 5జీ టెలికాం సేవలను ప్రారంభించినట్టు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. ఇప్పటికే తిరుపతి, వైజాగ్‌లలో 5జీ సేవలను ఆరంభించిన విషయం తెలిసిందే.
5జీ సర్వీసులను విస్తరించడంలో భాగంగా డాటా వినిమయంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో ఈ నూతన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం కొత్తగా టవర్లను ఆధునీకరించినట్టు చెప్పారు.