Vivo Y300 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వై సిరీస్ ఫోన్లలో కొత్త ఫోన్ వివో వై300 ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. అమోలెడ్ డిస్ ప్లేతో వస్తున్న ఈ మిడ్ రేంజ్ ఫోన్ క్వాల్ కామ్ చిప్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. వివో వై300 5జీ ఫోన్ రెండు వేరియంట్లు – 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.21,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ రూ.23,999లకు లభిస్తాయి. ఫాంటం పర్పుల్, ఎమరాల్డ్ గ్రీన్, టైటానియం సిల్వర్ కలర్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటుందీ ఫోన్. ఈ నెల 26 నుంచి వివో డాట్ కామ్ ద్వారా ప్రీ ఆర్డర్లు బుక్ చేసుకోవచ్చు. దేశంలోని అన్ని ఆధీకృత రిటైల్ స్టోర్లలో లభిస్తాయి. లాంచింగ్ ఆఫర్‌గా హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులపై రూ.1000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ తోపాటు ఆరు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది.
వివో వై300 5జీ ఫోన్ ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఫోన్ లో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు. వివో వై300 ఫోన్ 10802400 పిక్సెల్స్ రిజొల్యూషన్‌తోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లే. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ పోర్ట్రైట్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.