Vivo Y27 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. భారత్ మార్కెట్లో తన వివో వై-సిరీస్ ఫోన్లను విస్తరించింది. తాజాగా వివో వై27 ఫోన్ (Vivo Y27) ఆవిష్కరించింది. 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.14,999 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ (MediaTek Helio G85 SoC) చిప్ సెట్ తో వివో వై27 4జీ (Vivo Y27) ఫోన్ వస్తున్నది.
బర్గండీ బ్లాక్ (Burgundy Black), గార్డెన్ గ్రీన్ (Garden Green) రంగుల్లో ఫోన్ లభిస్తున్నది. 2.5 డీ గ్లాస్ బాడీ డిజైన్‌తోపాటు 6.64-అంగుళాల ఫుల్ హెచ్డీ + ఎల్సీడీ డిస్ ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 విత్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్ మీద పని చేస్తుంది. వివో ఆన్ లైన్ స్టోర్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఇతర భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ లభ్యం అవుతుంది.
వివో వై27 ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగా పిక్సెల్ బోకెహ్ కెమెరాతోపాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
వివో వై27 ఫోన్ డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ ఓటీజీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తోపాటు యాక్సెలో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.