Vivo Y200 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై200 5జీ (Vivo Y200 5G) ఫోన్‌ను గతేడాది అక్టోబర్‌లో ఆవిష్కరించింది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ఎస్వోసీ, 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. కొత్తగా 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను మార్కెట్లో ఆవిష్కరిస్తుంది. గత జూలైలో ఆవిష్కరించిన వివో వై27 4జీ, ఏప్రిల్ లో మార్కెట్లోకి వచ్చిన వివో టీ2 5జీ ఫోన్లపై ధరలు తగ్గించి వేసింది.
తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన వివో వై200 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.23,999లకు అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డీబీఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.2,000 ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. వివో వై200 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.21,999 పలుకుతుంది. ఈ ఫోన్ డసర్ట్ గోల్డ్, జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
వివో వై200 5జీ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్‌తో రావడంతోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే, 64-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్, 16-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ -13 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. 44వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
వివో వై27 4జీ ఫోన్ మీద ధర రూ.11,999లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐ, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డీబీఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి రూ.1000 క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. మరోవైపు వివో టీ2 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఫోన్ రూ.15,999, 8జీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999లకు లభిస్తాయి. తగ్గించిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి.
వివో వై27 4జీ ఫోన్ బర్గండీ బ్లాక్, గార్డెన్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 6.64 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2388×1080 పిక్సెల్స్) ఎల్సీడీ ప్యానెల్ కలిగి ఉంటుంది. మీడియా టెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్ సెట్ తోపాటు 44వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ సెల్ఫీ కెమెరా ఉంటాయి.
వివో టీ2 5జీ ఫోన్ నైట్రో బ్లేజ్, వెలోసిటీ వేవ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 6.38 – అంగుళాల అమోలెడ్ (1080×2400 పిక్సెల్స్) డిస్ ప్లే, 64-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్, 16-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి.