Vivo V40e | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వీ40ఈ (Vivo V40e) ఫోన్ను ఈ నెలాఖరులో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇప్పటికే భారత్ మార్కెట్లో ఉన్న వివో వీ40 ప్రో (Vivo V40 Pro), వివో వీ 40 (Vivo V 40) ఫోన్లతో వివో వీ40ఈ (Vivo V40e) జత కలువనున్నది. రాయల్ బ్రాంజ్ (Royal Bronze) కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
కర్వ్ డ్ డిస్ ప్లేతోపాటు 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న మిడ్ రేంజ్ ఫోన్ ఇది.