Vivo V30 – V30 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు వివో వీ30 (Vivo V30), వివో30 ప్రో (Vivo V30 Pro) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 1.5 కర్వ్ డ్ డిస్ ప్లేలు, 50-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలతో వస్తున్నది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ యూఐ వర్షన్ పై పని చేస్తుంది. ఈ నెలాఖరులో రెండు ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, ఇతర ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ నెల 14 నుంచి కొనుగోలు చేయొచ్చు. వివో వీ30 ప్రో ఫోన్ అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.41,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.46,999లకు సొంతం చేసుకోవచ్చు.
అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించే వివో వీ 30 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.33,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.37,999లకు లభిస్తాయి. ఎస్బీఐ లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా వర్తిస్తుంది. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూపంలో మరో రూ.4,000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
రెండు ఫోన్లూ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 300 టచ్ శాంప్లింగ్ రేటుతో 6.78 అంగుళాల కర్వ్డ్ 1.5 కే (2800×1260 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటాయి. 2800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. వివో వీ30 ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్, వివో వీ30 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ ఉంటుంది.
వివో వీ 30 ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, ఔరా లైట్ ఫ్లాష్ యూనిట్‌తో ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో 50-మెగా పిక్సెల్ సెన్సర్ సెకండరీ కెమెరా ఉంటుంది. వివో వీ30 ప్రో ఫోన్ లో అదనంగా 50-మెగా పిక్సెల్ పోర్ట్రైట్ సెన్సర్ కెమెరా ఉంటాయి. రెండు ఫోన్లలోనూ సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరాలు ఉంటాయి. వివో వీ 30, వివో వీ30 ప్రో ఫోన్లు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ సాయంతో 80వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలతో వస్తున్నాయి. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్లు కూడా ఉంటాయి. వివో వీ 30 ఫోన్ బ్లూటూత్ 5.4, వివో వీ30 ప్రో ఫోన్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కలిగి ఉంటాయి.