Vivo T3 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 ప్రో 5జీ (Vivo T3 Pro 5G) ఫోన్ ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దీంతోపాటు వివో టీ3 5జీ, వివో టీ3 లైట్ 5జీ, వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్లు కూడా ఆవిష్కరించనున్నది. వివో టీ3 ప్రో 5జీ ఫోన్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు అండ్ ఐ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుందని తెలుస్తున్నది. దీని ధర రూ.25 వేల లోపు ఉంటుందని సమాచారం.
వివో టీ3 ప్రో 5జీ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో వస్తోందని తెలుస్తున్నది. 80 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఐక్యూ జడ్9ఎస్ ప్రో ఫోన్ ను రీ బ్రాండ్ చేసి వివో టీ3 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరిస్తు్న్నారని సమాచారం. 50-మెగా పిక్సెల్ ఐఎంఎక్స్ 882 సోనీ మెయిన్ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుందని తెలుస్తోంది. 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా కూడా వస్తుంది. ఈ కెమెరా సెటప్ 4కే వీడియో రికార్డింగ్ కు మద్దతుగా ఉండటంతోపాటు ఏఐ ఫోటో ఎన్ హాన్స్, ఏఐ ఎరేజ్ వంటి ఏఐ బ్యాక్డ్ ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.