Vivo T3 Lite 5G | త్వరలో వివో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. వివో టీ3 లైట్ 5జీ..!
Vivo T3 Lite 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. తన వివో టీ3 లైట్ 5జీ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Vivo T3 Lite 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. అధికారికంగా వెల్లడించకున్నా ఈ నెలాఖరులో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. వివో నుంచి వస్తున్న మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌గా వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) భావిస్తున్నారు. గత మార్చిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన వివో టీ3 5జీ (Vivo T3 5G) ఫోన్‌తో జత కలువనున్నది.
రియల్మీ నార్జో ఎన్65 5జీ (Realme Narzo N65 5G) లేదా రియల్మీ సీ65 5జీ (Realme C65 5G) ఫోన్లకు పోటీగా వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) ఫోన్ వస్తుందని భావిస్తున్నారు. వివో టీ3 లైట్ 5జీ ఫోన్ ధర రూ.11,999 ఉండొచ్చునని తెలుస్తోంది. వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ తోపాటు ఏఐ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ సోనీ ప్రైమరీ సెన్సర్ కెమెరా, సెకండరీ కెమెరా ఉంటాయని తెలుస్తోంది. రెండు రంగుల్లో లభిస్తుందీ ఫోన్.
వివో టీ3 5జీ ఫోన్ కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ ఫ్లేక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్ సెట్, 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999లకు లభిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

