గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో నిర్లక్ష్యం.. ఓటు నమోదు గడువు పొడిగించాలి
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదని, అర్హులైన పట్టభద్రులు ఓటు హకుకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తంచేసింది. ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ బాధ్యతగా వ్యవహరించడం లేదని విమర్శించింది.
- ఓటు నమోదుపై పట్టభద్రుల్లో అవగాహన కల్పనకు వివిధ మాధ్యమాలో ప్రచారం కల్పించాలి
- మాజీ మంత్రి తలసాని డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదని, అర్హులైన పట్టభద్రులు ఓటు హకుకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తంచేసింది. ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ బాధ్యతగా వ్యవహరించడం లేదని విమర్శించింది. పట్టభద్రుల ఓటరు నమోదు గడువును పొడిగించడంతోపాటు, బూత్ లెవల్ అధికారులను (బీఎల్వోలు) క్రియాశీలకం చేసి ఇంటింటికీ వెళ్లి అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సోమవారం బీఆర్కే భవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదులో ఎదురవుతున్న సమస్యలను పార్టీ నేతలు వివరించారు.
అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు నవంబర్ 6తో గడువు ముగియనున్నా, ఇప్పటివరకు బీఎల్వోలను నియమించలేదని విమర్శించారు. ఓటరుగా నమోదు చేసుకోవాలనే విషయంలో ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం వారి బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తుందని చెప్పారు. గత గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ ఓటరుగా నమోదు చేసుకోవడం ఏమిటన్న ప్రశ్నకు ఎన్నికల కమిషన్ అధికారుల వద్ద సమాధానం లేదని అన్నారు. గత గ్రాడ్యుయేట్ ఎన్నికలలో హైదరాబాద్ నగర పరిధిలో ఒక లక్ష 10 వేల మంది ఓటర్లు నమోదు కాగా, ప్రస్తుతం ఇప్పటివరకు 23 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అధికారులు తెలపడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో 5.27 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు తప్ప, వాటి వెరిఫికేషన్ ప్రారంభించలేదని అన్నారు.
గ్రాడ్యుయేట్లు ఈ దేశ పౌరులు కారా?
తెలంగాణలోని గ్రాడ్యుయేట్లు ఈ దేశ పౌరులు కాదన్నట్టుగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నదని తలసాని అసహనం వ్యక్తంచేశారు. ఎన్నికల కమిషన్ తన బాధ్యతలను విస్మరించడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కష్టపడి గ్రాడ్యుయేట్ల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించిందని తెలిపారు. వాటిని అందజేసేందుకు అధికారుల వద్దకు వెళితే దరఖాస్తుదారులే రావాలని, బల్లో దరఖాస్తులు తీసుకోబోమని అభ్యంతరాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నమోదు గడువు పొడిగించాలి : దాసోజు
ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఈ నెల 24 నాటికి మొత్తం 5,23,758 ఫారం-18 దరఖాస్తులు అందగా, వాటిలో 26,085 మాత్రమే ఆమోదం పొందాయని, మరో 1,581 దరఖాస్తులు తిరసరణకు గురయ్యాయని, మిగిలిన 4,96,112 దరఖాస్తులు పరిశీలనలోనే ఉన్నాయని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చెప్పారు. 2021 ఓటరు జాబితాలో ఉన్న 10.36 లక్షల మందితో పోలిస్తే, ఇప్పటివరకు అందిన దరఖాస్తులు సుమారు 50.56 శాతమేనని అన్నారు. చాలామందికి తమ పేర్లు తిరిగి నమోదు చేసుకోవాలన్న విషయం తెలియడం లేదని అన్నారు. ఫారం-18 దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబర్ 6 నుంచి కనీసం నెల రోజులపాటు, డిసెంబర్ 6 వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కోలేటి దామోదర్ గుప్తా, మన్నె క్రిశాంక్, గజ్జెల నగేశ్, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జులు ఆనంద్‌గౌడ్, మాగంటి సునీత, ఆజామ్, ఓటరు నమోదు కార్యక్రమ ఇన్చార్జులు గోసుల శ్రీనివాస్‌యాదవ్, వెంకట్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, నాయకులు ముఠా జయసింహ, నరేందర్, పవన్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

