‘విద్వేష’ బిల్లును వెనక్కి తీసుకోవాలి.. ఇప్పటికే దేశంలో కఠిన చట్టాలు ఉన్నాయి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల (నిరోధక) బిల్లు, 2026’ను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి సోమా భరత్‌కుమార్ సోమవారం శాసనసభ సెలెక్ట్ కమిటీ చైర్మన్‌కు 11 పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు.
- రాష్ట్ర స్థాయిలో కొత్త చట్టం అవసరం లేదు
- ప్రభుత్వం తెచ్చిన బిల్లులో అనేక లోపాలు
- మీడియా, ప్రతిపక్ష గొంతును అణచివేసే కుట్ర
- సెలెక్ట్ కమిటీ చైర్మన్‌కు బీఆర్ఎస్ వినతి పత్రం
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల (నిరోధక) బిల్లు, 2026’ను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి సోమా భరత్‌కుమార్ సోమవారం శాసనసభ సెలెక్ట్ కమిటీ చైర్మన్‌కు 11 పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ బిల్లు ప్రస్తుత రూపంలో రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నదని తెలిపారు. బిల్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హకు), ఆర్టికల్ 19(1) (ఏ) (భావప్రకటన, పత్రికా స్వేచ్ఛ), ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ)ను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నదని బీఆర్ఎస్ పేరొన్నది.
ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడానికి దేశంలో ఇప్పటికే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్లు 196, 197, 299, 302, 353తోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000, తెహసీన్ పూనావాలా (2018) కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నాయని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. లోపం చట్టాల్లో లేదని, అమలు చేయడంలోనే ఉన్నదని ప్రవాసీ భలై సంఘటన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. సమగ్ర పార్లమెంటరీ పరిశీలన తర్వాత వచ్చిన కేంద్ర చట్టాలను తోసిరాజని, రాష్ట్రస్థాయిలో సమాంతరంగా మరింత కఠినమైన చట్టాన్ని తీసుకురావడం అనవసరమని పేర్కొన్నది.
నిర్వచనాల్లో అస్పష్టత
బిల్లులో పేరొన్న ‘గాయం’ (ఇంజూరి), ‘విద్వేషం’ (డిస్హర్మనీ), ‘శత్రుభావం’ (ఇల్- విల్ ), ‘పక్షపాత ప్రయోజనం’ ప్రీ జ్యుడీషీయల్ ఇం ట్రెస్ట్ వంటి పదాలకు స్పష్టమైన చట్టపరమైన నిర్వచనాలు లేవని బీఆర్ఎస్ విమర్శించింది. గతంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 66 ఏ లోని ఇలాంటి అస్పష్ట పదాలను పరిగణనలోకి తీసుకొని శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు దానిని కొట్టివేసిందని గుర్తుచేసింది. ఒక చట్టం సామాన్య పౌరుడికి ఏది నేరమో స్పష్టంగా చెప్పగలగాలని, అస్పష్టమైన పదాల వల్ల జర్నలిస్టుల వార్తలు, రాజకీయ వ్యంగ్యాలు, విమర్శలు సైతం అక్రమంగా నేరాల పరిధిలోకి వస్తాయని వివరించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం, భారతీయ నేర న్యాయ వ్యవస్థలో హేట్ క్రైమ్ అంటే దాడి, దహనం, హత్య వంటి భౌతిక హింసాత్మక నేరాలకు సంబంధించినదని వినతిపత్రంలో స్పష్టంచేశారు. కానీ ఈ బిల్లులోని క్లాజ్ 2(1)(iii) ప్రకారం కేవలం ఒక ప్రసంగాన్ని లేదా సంభాషణను కూడా హేట్క్రైమ్గా పరిగణించి 1 నుంచి 7 సంవత్సరాలు, రిపీట్ అఫెండర్లకు 10 సంవత్సరాల వరకు శిక్ష విధించేలా రూపొందించారని తప్పుబట్టింది.
బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 నోటీసు రక్షణను దెబ్బతీసేలా..
‘ఏడు సంవత్సరాల్లోపు శిక్ష పడే కేసుల్లో నిందితులను నేరుగా అరెస్టు చేయకుండా ముందస్తు నోటీసు ఇవ్వాలన్న నిబంధన బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 (గతంలో సీఆర్పీసీ 41ఏ), అర్నేష్‌కుమార్ తీర్పు ద్వారా అమల్లో ఉన్నది. బీఎన్ఎస్ సెక్షన్ 196 కింద ద్వేషపూరిత ప్రసంగాలకు గరిష్ఠంగా 3 నుంచి 5 ఏండ్ల శిక్ష మాత్రమే ఉండటం వల్ల నిందితులకు ఈ రక్షణ లభిస్తుంది. కానీ, ఈ రాష్ట్ర బిల్లులో శిక్షను 10 ఏండ్లకు పెంచడం వెనుక ఆ ముందస్తు నోటీసు రక్షణను తొలగించి, ఎఫ్ఐఆర్ నమోదు కాగానే నేరుగా అరెస్టు చేసే దురుద్దేశం దాగి ఉన్నది’ అని బీఆర్ఎస్ ఆరోపించింది. బిల్లు ప్రకారం గతంలో ఒక ఎఫ్ఐఆర్ లేదా చార్జ్ ఎదురొన్న వ్యక్తిని సైతం, కోర్టులో నేరం రుజువు కాకముందే రిపీట్ అఫెండర్‌గా పరిగణించే ప్రమాదకర నిబంధన ఉందని తెలిపింది. ఇది రాజ్యాంగం కల్పించిన ‘నేరం రుజువయ్యే వరకు నిందితుడు నిర్దోషే’ అనే ప్రాథమిక న్యాయ సూత్రానికి విరుద్ధమని స్పష్టం చేసింది. రాజకీయ ప్రత్యర్థులపై ఒకదాని వెంట ఒకటి తప్పుడు కేసులు బనాయించి, వెంటనే నాన్-బెయిలబుల్ సెక్షన్లతో జైలుకు పంపేందుకు ఈ క్లాజ్‌ను దుర్వినియోగం చేస్తారని హెచ్చరించింది.
అంతేకాకుండా.. ఏదైనా సంస్థ లేదా సంఘం ద్వారా ప్రకటనలు వెలువడినప్పుడు, అందులో బాధ్యులైన వారందరినీ నేరస్తులుగా పరిగణించే డీమింగ్ నిబంధనను క్లాజ్ 5లో చేర్చారని బీఆర్ఎస్ ఎత్తిచూపింది. ఇందులో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన భారాన్ని (రిజర్వ్ బర్డెన్ ఆఫ్ ప్రూప్) నిందితులపైనే నెట్టడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేరొంది. దీని ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధులు, డిజిటల్ మీడియా ఎడిటర్లు, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు, విద్యార్థి సంఘాల నాయకులను అన్యాయంగా ఇరికించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించే డిసిగ్నేటెడ్ ఆఫీసర్ ఎలాంటి న్యాయ విచారణ లేదా ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఏ మీడియా లేదా డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కంటెంట్‌నైనా తొలగించేలా (టేక్ -డౌన్/బ్లాకింగ్) క్లాజ్ 6 ద్వారా పూర్తి అధికారాలు కల్పించారని బీఆర్ఎస్ విమర్శించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం కేంద్ర పరిధిలో ఉండే ఈ ప్రక్రియకు న్యాయ సమీక్ష, కారణాలు చూపడం వంటి భద్రతలు ఉంటాయి, కానీ ఈ బిల్లులో ఎలాంటి కారణాలు చూపకుండానే ప్రభుత్వ వ్యతిరేక వార్తలను అణచివేసేలా అధికారాలను కేంద్రీకరించారని పేర్కొన్నది.
మీడియా, ప్రతిపక్ష గొంతులను అణచివేసే కుట్ర
ఈ బిల్లు లక్ష్యాల్లో ప్రధానంగా ‘డిజిటల్, సోషల్ మీడియా’ను లక్ష్యంగా చేసుకున్నట్టు ప్రభుత్వమే పేరొన్నదని బీఆర్ఎస్ తెలిపింది. ప్రభుత్వ అవకతవకలను బయటపెడుతున్న యూట్యూబ్ జర్నలిస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలు, స్వతంత్ర పత్రికలు, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడానికే ఈ బిల్లు తెచ్చారని ఆరోపించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజుల్లో, ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌లో ఉన్న సమయంలో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడం వెనుక రాజకీయ దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తున్నదని గుర్తుచేసింది. కర్ణాటకలో తీసుకొచ్చిన బిల్లుపై కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, అయితే అందులో కనీసం కళాత్మక, విద్యా సంబంధిత, వార్తా సేకరణకు మినహాయింపులు ఇచ్చారని తెలిపింది. కానీ తెలంగాణ బిల్లులో ఆ కనీస రక్షణలు కూడా లేవని ఎత్తిచూపింది.
ప్రత్యామ్నాయాలు.. చేయాల్సిన మార్పులు
బిల్లును పూర్తిగా వెనకి తీసుకోని పక్షంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పలు సవరణలను డిమాండ్ చేసింది. ‘విద్వేష ప్రసంగాన్ని కేవలం హింసను ప్రేరేపించే చర్యలకు మాత్రమే పరిమితం చేయాలి. పత్రికా వార్తలు, ప్రభుత్వాలు-విధానాలపై ప్రజాస్వామిక విమర్శలు, వ్యంగ్యం, కళలకు పూర్తి రక్షణ కల్పిస్తూ మినహాయింపుల నిబంధన ఎక్సెప్షన్ క్లాజ్‌లో చేర్చాలి. 10 సంవత్సరాల గరిష్ఠ శిక్షను తొలగించి ఐదేండ్లలోపునకు తగ్గించాలి. మొదటి తప్పునకు బెయిల్ ఇవ్వాలి. కోర్టుల్లో నేరం రుజువైన వారిని మాత్రమే రిపీట్ అఫెండర్లుగా గుర్తించాలి. రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ప్రతిపక్షాలు, మీడియా ప్రతినిధులతో స్వతంత్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటుచేయాలి. తప్పుడు, రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులు చేసే వారిపై శిక్షలు, పరిహార నిబంధనలు చేర్చాలి’ అని బీఆర్ఎస్ సూచించింది. ఇంత టి కీలకమైన బిల్లుపై అభ్యంతరాల స్వీకరణకు 10 రోజుల సమయం సరిపోదని, మరో 30 రోజులు పొడిగించాలని కోరింది. బిల్లును తెలుగు, ఉర్దూ భాషల్లోకి అనువదించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తిచేసింది. విసృ్తత బహిరంగ విచారణలు నిర్వహించి, ఆ తర్వాతే నివేదిక సిద్ధం చేయాలని డిమాండ్ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

