న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశీయ మార్కెట్లోకి వివో సరికొత్త ఫోన్లను విడుదల చేసింది. ఎక్స్90 సిరీస్‌లో భాగం గా రెండు మాడళ్లను పరిచయం చేసింది. వీటిలో 12జీబీ+256 జీబీ మెమోరీ కలిగిన ఎక్స్90 ప్రొ మాడ ల్ ధర రూ. 84, 999గా నిర్ణయించింది. అలాగే విపో ఎక్స్90 మాడల్ 8జీబీ+256 జీబీ మెమోరీ కలిగిన ధర రూ.59,999గాను, 12జీబీ+256జీబీ మెమోరీ కలిగిన మాడల్ రూ. 63,999కి లభించనున్నాయి.
వచ్చే నెల 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్లు లభించనున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ బ్యాంకుల కార్డులతో ముందస్తు బుకింగ్ చేసుకున్నవారికి 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభించనున్నది.