హైదరాబాద్, ఆగస్టు 15 : ప్రముఖ టెక్నాలజీ సంస్థ విరించి లిమిటెడ్ ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.79.77 కోట్ల ఆదాయాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.76.30 కోట్లతో పోలిస్తే 5.8 శాతం వృద్ధిని కనబరిచింది.
సాస్ వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించడంతోపాటు వాటాదారులకు దీర్ఘకాలికంగా మేలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.