హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాంలోని మూడు నగరాలైన హనోయి, హోచిమిన్, డానాంగ్లకు వియట్ జెట్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్‌ను అక్టోబర్ నుంచి నాన్‌స్టాఫ్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు. ఈ సర్వీసులు దక్షిణ భారతదేశం నుంచి మొదటివని ఆయన పేర్కొన్నారు. హనోయికి అక్టోబర్ 7న, హోచిమిన్ సిటీకి అక్టోబర్ 9న, డానాంగ్కు నవంబర్ 29న వియట్ జెట్ తొలివిమాన సర్వీసులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. వారానికి నాలుగు సార్లు సర్వీసులు అందుబాటులోకి తేనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.