KTR | చేతకాని వాళ్లు సవాల్ ఎందుకు చేయాలి?.. మంత్రి జూపల్లికి దమ్ముంటే గన్‌పార్క్ వద్దే ఉండాలి : కేటీఆర్
KTR challenged Minister Jupally | చేతకాని వాళ్లు ఎందుకు సవాల్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
KTR challenged Minister Jupally | మంత్రి జూపల్లి కృష్ణారావుకు(Minister Jupally) దమ్ముంటే గన్‌పార్క్ వద్దే ఉండాలి అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్(KTR challenged) విసిరారు. రాష్ట్రంలోని అప్పులపై చర్చిద్దామని సవాల్ స్వీకరించిన మంత్రి జూపల్లి తెలంగాణ భవన్‌కు 11 గంటలకు వస్తానని ఎందుకు రాలేదని ప్రశ్నిం చారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. బహిరంగ వేదికల్లో ప్రశ్నించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
చేతకాని వాళ్లు ఎందుకు సవాల్ చేయడమెం దుకు? తెలంగాణ భవన్‌కు వస్తామని ఫోజు కొట్టి పారిపోవడ మెందుకన్నారు. చేతగాని వాళ్లకు మాటలెక్కువ చెల్లని, నాణేనికి గీతలెక్కువ అని ఎద్దేవా చేశారు. నేను గన్‌పార్క్ వస్తే చార్మినార్ రమ్మంటారేమోనని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందే ఇప్పుడు ఏం జరుగుతుందో చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మాకు మాట్లాడే టైం ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని నిరూపిస్తామన్నారు.
ఆదానిని మించిపోయేలా అనుముల బ్రదర్స్ సంపాదిస్తున్నారు. 56 వేలు పోలీసులు ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు 5 వేల ఉద్యోగాలే వస్తాయని అంటున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 95 శాతం స్థానిక యువతకే ఉద్యోగాలు వచ్చేలా చేశామన్నారు. చేతగాని అసమర్ద సర్కార్‌పై పోరాడుతమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మేము లక్ష ఇండ్లు కట్టించాం కాంగ్రెస్ ఒక్క ఇల్లు కట్టినట్లు నిరూపించినా దేనికైనా సిద్ధమన్నారు. కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టారో మంత్రి పొంగులేటి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎక్సైజ్ శాఖలో జీవో వస్తే ఆశాఖ మంత్రి జూపల్లికి తెలియదు. నీ నిర్వాహకం వల్ల నిజాయితీ పరుడైన అధికారి బలయ్యాడని మండిపడ్డారు. సంక్షేమ శాఖలో రూ.2000 కోట్ల కుంభకోణం జరిగిందని హరీశ్ రావు చెప్పారు. ఆధారాలతో సహా నిరూపిస్తామంటే పోలీసులతో అడ్డుకున్నారని ఆరోపించారు. హరీశ్ రావు, ప్రవీణ్ కుమార్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంక్షేమ శాఖలో రూ.2000 కోట్ల కుంభకోణంపై హరీష్ రావు ఆరోపణలు చేస్తే చర్చ కోసం ముగ్గురు మంత్రులు గన్ పార్క్ దగ్గరికి రమ్మని అన్నారు
ముగ్గురు మంత్రులతో మాట్లాడడానికి హరీష్ రావు బయలుదేరితే తెలంగాణ భవన్ బయటే అరెస్ట్ చేశారు
ఒక మంత్రి ఏమో తెలంగాణ భవన్ దగ్గరికి వస్తానని చెప్పి… https://t.co/7eOHbHgNLx pic.twitter.com/s8QIq0mqRz
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

