Dhruv Vikram New Movie | మైత్రీ బ్యానర్లో విక్రమ్ కొడుకు ధ్రువ్ కొత్త సినిమా.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం!
DhruvVikram | టాలీవుడ్ స్టార్ నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లోనూ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతోంది.
D4 Pooja Ceremony | టాలీవుడ్ స్టార్ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లోనూ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా కోలీవుడ్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ఈ బ్యానర్ తాజాగా తమ అధికారిక తమిళ్ ప్రొడక్షన్లో నాలుగో ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఇటీవల బైసన్‌తో మెప్పించిన కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు, యువ సంచలనం ధ్రువ్ విక్రమ్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక సరికొత్త చిత్రాన్ని ప్రకటించింది. #MythriTamil04 మరియు ధ్రువ్ విక్రమ్ కెరీర్లో నాలుగో సినిమాగా (DV4) వర్కింగ్ టైటిల్స్‌తో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఈరోజు ఉదయం చెన్నైలో చిత్ర యూనిట్ సభ్యులు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ధ్రువ్ విక్రమ్ కెరీర్లోనే ఇప్పటివరకు రాని ఒక డిఫరెంట్ జోనర్లో, అవుట్ అండ్ అవుట్ పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలిచేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ కరణ్ ఎ. కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ఆయనతో పాటు రైటర్ శబీ సంయుక్తంగా ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను మరియు డైలాగ్స్‌ను అందిస్తున్నారు. కేవలం కథానాయకుడి పాత్రే కాకుండా సినిమాలో మిగిలిన పాత్రలు కూడా చాలా బలంగా ఉంటాయని, ఈ నేపథ్యంలోనే చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటుడు పృథ్విరాజ్ మరియు యాక్టర్ సాయి దీనలను ఎంపిక చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. విక్కీ సినిమాటోగ్రాఫర్‌గా విజువల్స్ అందిస్తుండగా, చియాన్ ఎడిటర్‌గా, జి.ఎమ్. శేఖర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇందులో హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయడం కోసం ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ వి.ఎమ్. మోర్‌ను రంగంలోకి దించారు. ఈ పూజా కార్యక్రమాలతోనే సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి తారాగణం, హీరోయిన్ మరియు టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

