Vespa | ముంబై, మార్చి 22: ఇటలీకి చెందిన ఐకానిక్ బ్రాండ్ వెస్పా.. ప్రత్యేక ఎడిషన్‌గా పలు మాడళ్లను విడుదల చేసింది. వెస్పా టెక్, వెస్పా ఎస్ టెక్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 125 సీసీ, 150 సీసీ సామర్థ్యంతో లభించనున్న వెస్పా స్కూటర్ ప్రారంభ ధర రూ.1,32,915గాను, అలాగే వెస్పా ఎస్ మాడల్ ధర రూ.1,36,791, అలాగే వెస్పా టెక్ మాడల్ ధర రూ.1,92,718గా నిర్ణయించింది.
ఈ ధరలు హైదరాబాద్ షోరూంనకు సంబంధించినవి. టీఎఫ్టీ స్మార్ట్ డ్యాష్, బ్లూటూత్ ఇంటిగ్రేషన్, నావిగేషన్, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, టీఎఫ్టీ డిస్ప్లే వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా పియాజియో వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ రఘువంశీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లగ్జరీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉన్నదని, ఈ క్రమంలోనే 2025 ఏడాదిలో వెస్పా పోర్ట్‌ఫోలియో మరిన్ని మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.