Vehicle Insurance | రోడ్డుపై వెహికల్తో వెళుతున్నప్పుడు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. సదరు వ్యక్తి ప్రాణానికి ముప్పు వాటిల్ల వచ్చు. ఆ వాహనం దెబ్బ తిన వచ్చు. ఇటువంటి అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నప్పుడు బీమా పాలసీ ఎంతో ఉపకరిస్తుంది. కనుక అన్ని రకాల వెహికల్స్‌కు ఇన్సూరెన్స్ చేయించడం తప్పనిసరి. అధిక కవరేజీ గల బీమా పాలసీలు ఎక్కువ ఫైనాన్సియల్ భద్రత కల్పిస్తాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే కాక సమగ్ర కవరేజీ ఎంచుకుంటే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటది.
వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీల కవరేజీ పరిమితులను బట్టి ప్రమాదం, ఇతర అనూహ్య ఘటనలు జరిగినప్పుడు మీకు సదరు బీమా కంపెనీ చెల్లించాల్సిన గరిష్ట మొత్తం నిర్ణయిస్తుంది. మామూలుగానైతే మోటార్ ఇన్సూరెన్స్ పాలసీల్లో పలు రకాల కవరేజీలు ఉంటాయి. ప్రతి కవరేజీ ఆప్షన్‌కు కూడా సొంత లిమిట్ ఉండొచ్చు. లయబిలిటీ, సమగ్ర కవరేజీ, కొలిజన్ కవరేజీ వంటివి ఉంటాయి.
మీరు ప్రయాణిస్తున్న కారు అనూహ్యంగా ప్రమాదానికి గురై ఉండొచ్చు. అటువంటప్పుడు డ్రైవర్ మెడికల్ బిల్లులు, ఇతర ఆస్తి నష్టం బిల్లుల చెల్లింపు విషయంలో ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలు, పరిమితులు ఉంటాయి. మీరు లయబిలిటీ కవరేజీ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే.. దాన్ని బట్టే డ్రైవర్ మెడికల్ బిల్లు, ఆస్తి నష్టం బిల్లు చెల్లింపుపై లిమిట్ ఉంటుంది. లయబిలిటీ కవరేజీ కంటే ఎక్కువ నష్టం వాటిల్లితే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యత వహించదు. మిగతా కవరేజీ ఆప్షన్లకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.
ఇన్సూరెన్స్ పాలసీలకు అనుగుణంగా కవరేజీ లిమిట్ విస్తృతంగా ఉండొచ్చు. మీ డ్రైవింగ్ రికార్డు, కారు తయారీ, దాని మోడల్, మీరు నివసించే ప్రాంతం కూడా కవరేజీ పరిమితులను ప్రభావితం చేస్తుంది. ప్రతి ఒక్కరూ తాము తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనలను జాగ్రత్తగా సమీక్షించుకుని కవరేజీ పరిమితులను అర్థం చేసుకోవాలి.
మీరు వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వేళ.. కవరేజీ ఆప్షన్ ఎంచుకునే సమయంలో వ్యక్తిగత పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అత్యంత విలువైన వెహికల్ అయితే, అధిక కవరేజీతో కూడిన క్లయిమ్ కలిగి ఉండవచ్చు. ఇటువంటప్పుడు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. పరిమితమైన ఆర్థిక వనరులు ఉంటే తక్కువ కవరేజీ ఆప్షన్ ఎంచుకోవాలి.
కొత్త కారు కొనుగోలు చేస్తే సమగ్ర వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. దీంతోపాటు మరికొన్ని ముఖ్యమైన యాడ్-ఆన్స్ తీసుకుంటే వెహికల్‌కు మరింత భద్రత లభిస్తుంది. కొన్ని యాడ్-ఆన్స్ పథకాలకు అదనపు ప్రీమియం చెల్లించాకే బేసిక్ ప్లాన్ కు ఆ ఇన్సూరెన్స్ పథకాలు జత కలుస్తాయి. జీరో డిప్రిషియేషన్ కవర్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్షన్, ప్యాసింజర్ కవర్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.