న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: రాష్ట్రంలోని ప్లాంట్‌కు సంబంధించి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి నాట్కో ఫార్మాకు సోమవారం హెచ్చరిక లేఖ వచ్చింది. కొత్తూరులోని ఫార్ములేషన్ ఫెసిలిటీని పరిశీలించిన అనంతరం ఫామ్ 483 కింద అమెరికా హెల్త్ రెగ్యులేటర్ 8 అబ్జర్వేషన్లను జారీ చేసిందని మంగళవారం నాట్కో ఫార్మా తెలియజేసింది. గత ఏడాది అక్టోబర్ 9 నుంచి 18 మధ్య ఈ తనిఖీలు జరిగాయి.