Reciprocal Tariffs | అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. యూఎస్‌పై చైనా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశ సూచీలు ఐదు శాతం వరకు నష్టపోయాయి. అమెరికా ప్రామాణిక సూచీ ఎస్అండ్పీ 500 ఐదు శాతం మేర నష్టపోగా, డౌ జోన్స్ 1,600 పాయింట్లు కోల్పోయింది.
క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 70 డాలర్ల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి తెరలేవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధనానికి డిమాండ్ పడిపోయే ప్రమాదం ఉన్నదని, దీంతో ధరలు భారీగా తగ్గాయని పేర్కొంది. దీంతోపాటు వచ్చే నెల నుంచి ఒపెక్ దేశాల రోజువారి క్రూడాయిల్ ఉత్పత్తిని 4.11 లక్షలకు పెంచేయోచనలో ఉండటం కూడా ధరలు తగ్గడానికి కారణం.