న్యూఢిల్లీ, నవంబర్ 18 : వాణిజ్యంపై భారత్-అమెరికా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పట్లో కుదిరేటట్టు కనిపించడం లేదు. టారిఫ్ల విధింపుపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు న్యాయంగా, సమానంగా, సమతుల్యంగా మారినప్పుడు మీరు శుభవార్త వింటారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నది.
టారిఫ్ల విధింపుపై ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య కొనసాగుతున్న చర్చలు ఇప్పటికి కొలిక్కిరాలేదు. వాణిజ్యమంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన ఇండో-అమెరికన్ కాంగ్రెస్ సమ్మిట్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ ఒప్పందం న్యాయంగా, సమానంగా, సమతుల్యంగా మారినప్పుడు మీరు శుభవార్త వింటారని గోయల్ అన్నారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై ఈ ఏడాది మార్చి నుంచి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.