హైదరాబాద్, జూలై 19: అమెరికాకు చెందిన కార్ కేర్ కంపెనీ టర్ట్లీ వాక్స్ ఇండియా.. హైదరాబాద్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. ఇప్పటికే ఆరు స్టూడియోలను నిర్వహిస్తున్న సంస్థ..తాజాగా మరో మూడు అవుట్లెట్లను బుధవారం ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలో స్టూడియోల సంఖ్య పదికి చేరుకున్నాయి. కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి లౌరీ కింగ్ ముఖ్యఅతిధిగా హాజరై వీటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సజన్ మురళీ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో కార్ల ఆధునీకరణకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మరో మూడు స్టోర్లను ఒకేరోజు ప్రారంభించినట్లు, ముఖ్యంగా యువత కోరుకుంటున్న విధంగా కార్లలో ఇంటీరియర్ డిజైనింగ్, పాలిషింగ్, వ్యాక్సింగ్ చేయనున్నట్లు తెలిపారు.