విలీనంతో విలవిల!
మహానగర పాలక సంస్థ నుంచి కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)లో విలీనమైన ప్రాంతాల ప్రజల పరిస్థితి ప్రస్తుతం ‘అయోమయం’లో పాలన...అవస్థల్లో ప్రజలు అన్నట్లుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలీనంతో అభివృద్ధ్ది పరుగులు తీస్తుందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- జీహెచ్ఎంసీ నుంచి సీఎంసీగా ఏర్పాటు
- సీఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల పరిస్థితి దయనీయం
మణికొండ, సెప్టెంబర్ 2: మహానగర పాలక సంస్థ నుంచి కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)లో విలీనమైన ప్రాంతాల ప్రజల పరిస్థితి ప్రస్తుతం ‘అయోమయం’లో పాలన…అవస్థల్లో ప్రజలు అన్నట్లుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలీనంతో అభివృద్ధ్ది పరుగులు తీస్తుందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి సమస్యల పరిష్కారానికి కూడా రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, కొన్ని ప్రాంతాలల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నా మరమ్మత్తులకు నోచుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వర్షం పడితే రోడ్లపై నీరు నిలిచిపోవడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, చెత్త తొలగింపులో జాప్యం వంటి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని వాపోతున్నారు.
సమన్వయ లోపం..
అధికారుల మధ్య సమన్వయం లోపించడం, కొత్త పరిపాలనా వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని స్థానికులు అంటున్నారు. మున్సిపాలిటీల నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోకి విలీనం చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించడమే అయితే… ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రత్యేక నిధులు కేటాయించి అవసరమైన సిబ్బందిని నియమించి, ప్రజలకు అందుబాటులో ఉండే సమర్థవంతమైన పాలన అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ నుంచి సీఎంసీగా ఏర్పాటై శివారు మున్సిపాలిటీలను నూతన కార్పొరేషన్లో విలీనం చేసి పేరు మారితే సరిపోదని పరిపాలనా సరిహద్దులకే పరిమితం కాకుండా అభివృద్ధి వెలుగులు నింపాలని స్థానికులు కోరుతున్నారు. విలీనం తర్వాత పరిస్థితులు మరింత మెరుగుపడాలి తప్ప..సమస్యలు పెరిగేలా ఉండకూదని స్పష్టం చేస్తున్నారు. విలీనమైన మున్సిపాలిటీ ప్రాంతాల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

