న్యూఢిల్లీ: రైడ్ హైలింగ్ వ్యాపారంలోకి రోబోటాక్సీల ప్రవేశాన్ని ఎదుర్కొనేందుకు, కొవిడ్-19 మహమ్మారి తర్వాత తన అతి పెద్ద కోతలలో భాగంగా ఊబర్ టెక్నాలజీస్ దాదాపు 3,300 మంది ఉద్యోగులను అంటే 10 శాతం సిబ్బందిని తొలగించనుంది. ఈ కోతల ద్వారా మేనేజ్మెంట్ స్థాయిలు సులభతరం అవుతాయని, వేగవంతమైన వృద్ధి సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో సంస్థాగత సంక్లిష్టతను తగ్గిస్తాయని సంస్థ సీఈవో ఖోస్రాషాహి బుధవారం ఉద్యోగులకు రాసిన నోట్లో తెలిపారు. కాగా పలు టెక్ ఎగ్జిక్యూటివ్‌ల మాదిరిగా ఖోస్రాషాహి ఈ ఉద్యోగ కోతలకు ఏఐ కారణమని చెప్పలేదు. ఈ నిర్ణయం భవిష్యత్తులో కీలక వృద్ధికి, నూతన ఆవిష్కరణలకు, తిరిగి పెట్టుబడులు పెట్టడానికి అవసరమయ్యే పొదుపును సృష్టిస్తుందని అన్నారు. అమెరికాలో అదిపెద్ద రోబో టాక్సీ ఆపరేటర్ వేమోతో ఉబర్‌కు పోటీ పెరుగుతున్నందున ఉబర్ ఈ నిర్ణయం తీసుకున్నదనే వార్త వినిపిస్తోంది.