సిటీబ్యూరో, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లో విలువైన భూముల వేలం మొదలైంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన భూముల వేలంపాటలో మొత్తం 70 ప్లాట్లకు గాను 57 ప్లాట్లను అమ్మివేశారు.
మోకీల లే అవుట్లోని 32 ప్లాట్లను విక్రయించగా, సగటు గజం ధర 63,511గా, మొత్తం రూ. 66.48 కోట్లు వచ్చాయి. అదేవిధంగా బాచుపల్లి లే అవుట్లోని 25 ప్లాట్లను విక్రయించగా సగటు గజం ధర రూ. 51,991గా నిలిచి రూ. 35.03 కోట్ల ఆదాయం రాగా, వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 101.51 కోట్ల ఆదాయం సమకూరింది.