UPI Charges | యూపీఐ సర్వీసులు ఎప్పటికీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయా? అన్న ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ఎంపీసీ నిర్ణయాల ప్రకటన తర్వాత ఆయన మీడియాతో ఆయన మాట్లాడారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నడిపేందుకు అయ్యే ఖర్చును కాలక్రమేణా ఎవరైనా భరించాల్సి ఉంటుందన్నారు. యూపీఐ సర్వీస్‌లు ఎప్పుడూ ఉచితంగానే అందుబాటులో ఉంటాయన్న విషయం తాను చెప్పలేనన్నారు. ఆపరేషన్‌కు సంబంధించిన ఖర్చలు ఉన్నాయని.. ఖర్చును ఎవరైనా భరించాల్సి ఉంటుందన్నారు. ఎవరు చెల్లిస్తారనేది ముఖ్యమని.. కానీ ఎవరు చెల్లిస్తున్నారనే ముఖ్యం కాదన్నారు. ఈ మోడల్ స్థిరత్వం, సమష్టిగా, వ్యక్తిగతంగా ఆపరేషన్ కోసం చెల్లింపులు ముఖ్యమన్నారు. యూపీఐ వ్యవస్థపై విధిస్తున్న చార్జీలపై నివేదికల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆగస్టు ఒకటి నుంచి యూపీఐ చెల్లింపుల కోసం అగ్రిగేటర్ల నుంచి అధికారికంగా చార్జీలు వసూలు చేస్తున్న దేశంలోనే తొలి బ్యాంక్కుగా ఐసీఐసీఐ నిలుస్తుందని పలు నివేదిక పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో బ్యాంక్ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. జూన్ చివరలో కొత్త ఫీజుల నిర్మాణంపై ఐసీఐసీఐ బ్యాంక్ అగ్రిగేటర్లకు సమాచారం ఇచ్చిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. ఎస్క్రో ఖాతాలను నిర్వహిస్తున్న చెల్లింపు అగ్రిగేటర్ల నుంచి బ్యాంకు 2 బేసిస్ పాయింట్లు (రూ. 100 లావాదేవీకి 2 పైసలు) ఛార్జీగా వసూలు చేస్తోందని సమాచారం. గరిష్ట పరిమితి లావాదేవీకి రూ.6గా నిర్ణయించారు. అదే సమయంలో నాన్-ఎస్క్రో ఖాతాలను నిర్వహిస్తున్న చెల్లింపు అగ్రిగేటర్ల నుంచి 4 బేసిస్ పాయింట్లు, గరిష్టంగా రూ.10 వసూలు చేయనున్నారు. అయితే, ఐసీఐసీఐ బ్యాంక్ మర్చంట్ అకౌంట్ నుంచి జరిగే లావాదేవీలపై ఎలాంటి చార్జీలు విధించడం లేదని నివేదికలున్నాయి. ప్రస్తుతం ఖాతాదారులు, వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. అయితే, జులై ప్రారంభంలో జరిగిన బీఎఫ్ఎస్ఐ సమ్మిట్ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఫ్రీ యూపీఐ సేవలు చాలాకాలంగా నిలకడగా ఉన్నాయన్నారు.
ఇది కీలకమైన మౌలిక సదుపాయాలని.. ఈ సర్వీస్ ఉచితంగా అందుబాటులో ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని.. సిబ్సిడీ ఉస్తుందన్నారు. డిజిటల్ చెల్లింపులపై మాట్లాడుతూ తన దృష్టిలో మంచి ఫలితాలు చూపించిందని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం.. జూన్‌లో 18.4 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వార్షిక ప్రాతిపదికన 32శాతం వృద్ధిని నమోదు చేసింది. యూపీఐ, ఇతర చెల్లింపు వ్యవస్థ అందుబాటులో ఉండడం సురక్షితమైంది.. స్థిరమైందని.. ఎవరైనా ఖర్చులు భరిస్తేనే స్థిరంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వమైనా.. మరెవరైనా అది కీలకం కాదని.. కీలకమైన విషయం సర్వీసుల ఖర్చను సమష్టిగా లేదంటే వినియోగదారుల తరఫున చెల్లించాలన్నారు. ప్రస్తుత వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వం నుంచి సబ్సిడీపై ఆధారపడి ఉందని ఆర్బీఐ గవర్నర్ అంగీకరించారు. ఇంత పెద్ద ఎత్తున లావాదేవీలకు బ్యాంకులు, ఇతర వాటాదారులపై ప్రత్యక్ష ఖర్చు భారం లేదన్నారు.