న్యూఢిల్లీ, జనవరి 3 : ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా(వీఐ) తన కస్టమర్లకు శుభవార్తను అందించింది. వార్షిక రీచార్జి ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల కింద అన్లిమిటెడ్ డాటాను అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నాం వరకు అందుకోవచ్చునని తెలిపింది. రూ. 3,599, రూ.3,699, రూ.3,799 ప్రీ-పెయిడ్ ప్లాన్లలో అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటలకు వరకు అన్లిమిటెడ్ డాటాతోపాటు మిగతా సమయంలో రోజువారి 2జీబీ డాటాను కూడా పొందవచ్చునని తెలిపింది. ఈ ప్రత్యేక ప్యాక్‌లు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, బెంగాల్, పంజాబ్, హార్యానా సర్కిళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు, సమీప భవిష్యత్తులో మిగతా సర్కిళ్లలో కూడా ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.