హైదరాబాద్, ఆగస్టు 12 : యూనియన్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లోకి మరో ఫండ్‌ను విడుదల చేయబోతున్నది. సెప్టెంబర్ 1న ప్రారంభంకానున్న ఈ ఫండ్ అదే నెల 15న ముగియనున్నదని కంపెనీ ఎండీ, సీఈవో మధు నాయర్ తెలిపారు.
ఈ ఫండ్‌తో గరిష్ఠంగా రూ.750 కోట్లు నిధులు సేకరించాలనుకుంటున్నట్టు చెప్పారు.