హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) రీఫార్మ్స్-2024లో తెలంగాణ రాష్ర్టానికి ‘టాప్ అచీవర్’గా గుర్తింపు దక్కింది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను బలోపేతం చేసేందుకు బీఆర్ఏపీ-2024 7వ ఎడిషన్‌ను ఇటీవల ప్రారంభించింది.
వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడానికి విసృ్తతమైన సంప్రదింపులు, వాటాదారుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన బీఆర్ఏపీ-2024 లో 434 రీఫార్మ్ పాయింట్లు ఉన్నాయి. ఇందులో కార్మిక చట్టాలు, భూ పరిపాలన, ఆస్తి రిజిస్ట్రేషన్, పెట్టుబడి-పర్యావరణ అనుమతుల వంటి అంశాలున్నాయి.