హైదరాబాద్, సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్‌ను, నమూనాల తయారీ కేంద్రం టీ వర్క్స్లను ఒమన్ కేంద్ర మంత్రి డాక్టర్ సౌద్ అల్ హబ్సీ శనివారం సందర్శించారు. వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ చైర్మన్ సందీప్ మక్తలతో కలిసి స్టార్టప్ కార్యకలాపాలను పరిశీలించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటవుతున్న స్టార్టప్‌లకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహాం బాగుందని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.
టీ హబ్‌తో డీబీఎస్ ఒప్పందం
స్టార్టప్‌లను ఆర్థికంగా ప్రోత్సహించేందుకుగాను డీబీఎస్ బ్యాంకుతో టీ హబ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు నిధుల కొరత తీరనున్నది. ఈ నేపథ్యంలో టీ హబ్ నిర్వాహకులు..బ్యాంకు ప్రతినిధులతో సంప్రదించి, విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు ఆర్థికంగా లభ్దిచేకూరనున్నదని టీ హబ్ ప్రతినిధి తెలిపారు.