GST Council Meeting | వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting) ఇవాళ ప్రారంభమైంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జీఎస్టీ కౌన్సిల్ ఇవాళ సమావేశమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు సహా పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
కాగా, గతేడాది అక్టోబర్ 7న చివరిసారిగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత జరగాల్సిన కౌన్సిల్ మీటింగ్‌ను.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా మరోసారి నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. దీంతో తదుపరి కౌన్సిల్ మీటింగ్‌ను ఇవాళ నిర్వహించారు.
#WATCH | Union Finance Minister Nirmala Sitharaman chairs the 53rd GST Council meeting, in Delhi. pic.twitter.com/QwAv02b5vY
— ANI (@ANI) June 22, 2024
Also Read..
Madhya Pradesh | మహిళపై కర్రతో దాడి.. రక్షించకపోగా వీడియోలు తీసిన జనం
Swimming Pool | షాకింగ్.. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకొచ్చి కుప్పకూలి బాలుడు మృతి.. VIDEO
NTRNeel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా నేషనల్ క్రష్.?