Ramdas Athawale | కేంద్ర బడ్జెట్‌పై విపక్ష నేతల ప్రకటనల తీరుపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించిన కేంద్ర (2025-26) బడ్జెట్‌పై విపక్షాల దృక్పథం యూస్ లెస్ అని కొట్టే పారేశారు. దేశంలోని అన్ని సెక్షన్ల ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని, దేశ వృద్ధి పురోభివృద్ధికి దోహద పడేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు.
’కేంద్ర బడ్జెట్ యూజ్లెస్ అని విపక్షాలు అంటున్నాయి. కానీ, వారి దృక్పథమే మాత్రమే యూజ్లెస్. ఆర్థిక వ్యవస్థ పురోగతికి బడ్జెట్ దోహదం చేస్తుంది. అన్ని సెక్షన్ల ఆకాంక్షలను బడ్జెట్లో పరిగణనలోకి తీసుకున్నారు’ అని రాందాస్ అథవాలే పేర్కొన్నారు. బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. నిధులు, పథకాల కేటాయింపులో బీహార్‌కు పెద్ద పీట వేశారని, వివిధ విభాగాల కేటాయింపుల్లో మహారాష్ట్ర కూడా లాభ పడిందన్నారు. అలాగే మధ్య తరగతి ప్రజలకు ఆదాయం పన్ను రిలీఫ్ కల్పించడం గొప్ప నిర్ణయం అని పేర్కొన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతులను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన బడ్జెట్ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.