Income Tax | ఈ బడ్జెట్‌పైనే వేతనజీవుల ఆశలు.. ఈసారైన పన్ను ఊరట దక్కేనా!న్యూఢిల్లీ, జనవరి 28: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆదాయ పన్ను (ఐటీ) విధానానికి సంబంధించి ట్యాక్స్‌పేయర్స్, సగటు వేతన జీవులు భారీ ఆశల్నే పెట్టుకున్నారు. పాత, కొత్త ఆదాయ పన్ను విధానాలను అనుసరించేవారు మాకివి కావాలన్న డిమాండ్లను వ్యక్తం చేస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న వృద్ధిరేటు అవకాశాలు, అధిక వడ్డీరేట్లు, నిరాశపరుస్తున్న ఉత్పత్తి, మందగించిన వినిమయ సామర్థ్యం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం వంటివి ఇప్పుడు మోదీ సర్కారుకు సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఎవరి అంచనాల్ని, మరెవరి ఆశల్ని ఎంతవరకు నెరవేరుస్తుందన్నది మిక్కిలి ప్రాధాన్యతగా నిలుస్తున్నది.
ఇదీ సంగతి..
పన్ను కోతలు, మినహాయింపులు లేకుండా సరళతరంగా రూపొందించినదే కొత్త పన్ను విధానం. 2020 బడ్జెట్లో దీన్ని మోదీ సర్కారు పరిచయం చేసింది. వార్షిక ఆదాయ పరిమితులు, దానికి తగ్గట్టు పన్ను శ్లాబులే ఇందులో ఉంటాయి. ఇక పాత పన్ను విధానంలో రకరకాల సెక్షన్ల కింద వివిధ పెట్టుబడులు, పొదుపు, ఆదాయ-వ్యయాలపై పన్ను కోతలు, మినహాయింపులు వర్తిస్తాయి. ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల ప్రకారం ప్రస్తుతం దేశంలోని 72 శాతం మంది ట్యాక్స్‌పేయర్స్.. కొత్త ఆదాయ పన్ను విధానాన్నే అనుసరిస్తున్నారు. 28 శాతం మంది పాత ఆదాయ పన్నును ఎంచుకొంటున్నారు. వీరిని కూడా కొత్త ఆదాయ పన్ను విధానంలోకే తేవాలని గత కొన్నేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రతీ బడ్జెట్లో పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. కొత్త పన్ను విధానానికే మెరుగులు దిద్దుతూ వస్తున్నది. మరి ఈసారైనా ఈ రెండు విధానాల్లో మార్పులు కావాలని కోరుతున్న ట్యాక్స్‌పేయర్స్ ఆశలు ఫలిస్తాయా? లేక ఎప్పట్లాగే కొత్త పన్ను విధానానికి సంబంధించి వచ్చే డిమాండ్లపైనే దృష్టి సారిస్తారా? అన్నది వేచిచూడాల్సిందే.
బడ్జెట్లో ట్యాక్స్ పేయర్స్ డిమాండ్లు..పాత పన్ను విధానంలో..
కొత్త పన్ను విధానంలో..