బెంగళూరు, మార్చి 5: ఎలక్ట్రిక్ ప్రీమియం మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ అల్ట్రావాయిలెట్..తాజాగా స్కూటర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ టెసెరాక్ట్తోపాటు మోటర్‌సైకిల్ షాక్‌వేవ్‌ను కూడా దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.2 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధర తొలి 10 వేల యూనిట్లకు మాత్రమే వర్తించనున్నదని, ఆ తర్వాత స్కూటర్ ధరను రూ.1.45 లక్షలకు పెంచనున్నట్లు కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ నారాయణ్ సుబ్రమణ్యం తెలిపారు. అలాగే ఈ-బైక్ షాక్వేవ్ ప్రారంభ ధర రూ.1,49, 999గా నిర్ణయించింది. ఈ ధర తొలి వెయ్యి బైకులకు మాత్రమే వర్తించనున్నదని, ఆ తర్వాత ఈ బైకును రూ.1.75 లక్షలకు సవరించనున్నట్లు ఆయన చెప్పారు. సింగిల్ చార్జింగ్‌తో 260 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.