Russia-Ukraine War | రేపు 11 విమానాల్లో 2200 మంది ఇండియన్స్ తరలింపు
Russia-Ukraine War | ఉక్రెయిన్ నుంచి ఆదివారం 11 విమానాల్లో 2,200 మందికి పైగా ఇండియన్స్‌ను తరలిస్తామని కేంద్రం తెలిపింది.
Russia-Ukraine War | ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం తరలిస్తున్నది. ఆదివారం 11 విమానాలు ఉక్రెయిన్ ఇరుగు పొరుగుదేశాల నుంచి 2200 మందికి పైగా ఇండియన్స్‌ను తరలిస్తాయని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం 15 విమనాల్లో సుమారు 3000 మందిని తరలించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. 12 ప్రత్యేక, మూడు వాయుసేన (ఐఏఎఫ్) విమానాల్లో వారిని తరలించామని వివరించింది.
గత నెల 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు నిర్వహిస్తున్నది. దీంతో ఉక్రెయిన్ తన గగన తలాన్ని మూసేసింది. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను దాని పొరుగు దేశాలైన రొమేనియా, హంగరీ, స్లోవేకియా, పోలండ్‌ల నుంచి భారతీయ విమానాలు తరలిస్తున్నాయి.
మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ప్లేన్లు సీ-17లను ఉపయోగిస్తూ భారతీయులను తరలిస్తున్నది. ఇండిగో, ఎయిరిండియా, విస్తారా, స్పైస్‌జెట్ వంటి పౌర విమానయాన సంస్థలు ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.
శనివారం హంగరీలోని బుడాపెస్ట్ నుంచి ఐదు, రొమేనియాలోని సుకేవా నుంచి నాలుగు, స్లోవేకియా నుంచి కోసికే నుంచి ఒకటి, పోలండ్‌లోని రెస్జోవో నుంచి రెండు విమానాల్లో భారతీయులను తరలించామని పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం బుడాపెస్ట్, కొసికే, రెస్జోవో, బుడాపెస్ట్ నుంచి 11 విమానాలు నడుపుతామని భావిస్తున్నట్లు పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

