న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ విస్తరణ బాటపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కొత్తగా 150 శాఖలను ప్రారంభించనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో అశ్వాని కుమార్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,322 శాఖలు ఉండగా, వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్య 3,472కి చేరుకోనున్నట్టు చెప్పారు.
ఇందుకోసం భారీగా ఉద్యోగులను నియమించుకోనున్నట్టు, వీరిలో ఐటీ, డిజిటల్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వారు కూడా ఉండనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ చివరినాటికి బ్యాంక్లో 21,266 మంది సిబ్బంది ఉండగా, వీరిలో 70 శాతం మంది సరాసరి వయస్సు 70 ఏండ్ల కంటే తక్కువగా ఉందన్నారు. గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ రూ.7,421 కోట్ల ఆదాయంపై రూ.620కోట్ల నికర లాభాన్ని గడించింది.