యూకో బ్యాంక్ లాభం 801 కోట్లు
ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.801 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.801 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.653 కోట్ల లాభంతో పోలిస్తే 22.66 శాతం వృద్ధిని కనబరిచింది. లాభాల్లో భారీ వృద్ధిని కనబరిచిన బ్యాంక్ ఆదాయం మాత్రం రూ.8,137 కోట్ల నుంచి రూ.7,365 కోట్లకు తగ్గినట్టు పేర్కొంది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.6,656 కోట్లుగా ఉన్నది.
మరోవైపు, ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా సమావేశమైన బ్యాంక్ బోర్డు రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకూ 44 పైసలు లేదా 4.40 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.69 శాతం నుంచి 2.17 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 0.5 శాతం నుంచి 0.27 శాతానికి దిగొచ్చింది.
అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యూఐపీ, ఎఫ్పీవోతోపాటు ఇతర రూట్లలో రూ.2,700 కోట్ల నిధులను సేకరించడానికి బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్చి చివరినాటికి బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.5,90,314 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం బ్యాంక్ దేశవ్యాప్తంగా 3,412 శాఖలను నిర్వహిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

