నూఢిల్లీ, ఏప్రిల్ 14 : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో..వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా సమ్మర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘సమ్మర్ గేటవే’ సేల్ కింద దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 10 శాతం వరకు డిస్కౌంట్ను కల్పిస్తున్నది.
ఈ నెల 17 వరకు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు జూలై 1 నుంచి అక్టోబర్ 9 లోగా ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చునని సూచించింది. ఈ ఆఫర్లు కంపెనీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సప్ సర్వీసెస్(7065145858)లతో బుకింగ్ చేసుకోవచ్చును. వీటితోపాటు ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీసులపై 70 శాతం రాయితీ ఇస్తున్న సంస్థ, బ్యాగేజ్పై 50 శాతం తగ్గింపుతో అందిస్తున్నది.