హైదరాబాద్, అక్టోబర్ 31: కృత్రిమ మేధస్సు ఆధారంగా సెక్యూరిటీ ఆటోమేషన్ సేవలు అందించే స్విమ్‌లేన్..హైదరాబాద్‌లో ప్రాంతీయ సైబర్‌సెక్యూరిటీ ఇన్నోవేషన్‌తోపాటు ఆర్ అండ్ డీ సెంటర్‌ను మంగళవారం ప్రారంభించింది. ప్రాంతీయంగా సైబర్‌సెక్యూరిటీ ఇన్నోవేషన్ సేవలకోసం ప్రారంభించిన ఈ సెంటర్లో ప్రస్తుతం 70 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాది చివరినాటికి సిబ్బంది సంఖ్యను 200కి పెంచుకోనున్నట్లు స్విమ్‌లేన్ చీఫ్ టెక్నాలజీ అధికారి ఫ్రాన్స్ జవేర్ తెలిపారు. ప్రొడక్ట్ డెవలప్మెంట్ హబ్‌గా ఈ సెంటర్‌ను తీర్చిదిద్దనున్నట్టు, ముఖ్యంగా ఇంజినీరింగ్, కస్టమర్లకు ప్రత్యేక సేవలు అందించడానికి ఈ సెంటర్‌ను నెలకొల్పినట్టు చెప్పారు. పరిశోధన, ప్రతిభ కలిగిన సిబ్బంది హబ్‌గా కొనసాగుతున్న నగరంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నదని, సైబర్ సెక్యూరిటీలో సెక్యూరిటీ ఆటోమేషన్ చాలా కీలకమని, ఈ పరిశోధన కేంద్రంతో ఆటోమేషన్ రంగంలో కీలక పాత్ర పోషించడానికి వీలు పడనున్నదన్నారు.
భారత్‌లో మరింత విస్తరణ
అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు. 2027 నాటికి భారత్‌లో సైబర్సైక్యూరిటీ మార్కెట్ 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటున్నదన్న అంచనాతో ఇక్కడ మరో ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినట్టు తెలిపారు. ప్రతిభ, టెక్నాలజీ కోసం భవిష్యత్తులోనూ పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించిన ఆయన..సెక్యూరిటీ ఆటోమేషన్ విప్లవాత్మక మార్పులు సృష్టించనున్నదన్నారు.