హైదరాబాద్, మార్చి 21: టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం దేశంలో డీజీసీఐ ఆమోదం పొందిన మొట్టమొదటి సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ‘ఒబెబా-ఆర్’ను విడుదల చేస్తున్నట్టు ప్రముఖ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. దేశంలో టైప్-2 మధుమేహ నిర్వహణ కోసం, అధునాతన జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్ ఆధారిత చికిత్స లభ్యతను విస్తరించడంలో సెమాగ్లుటైడ్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) ఆమోదం పొందిన తొలి సంస్థ రెడ్డీస్ కావడం విశేషం.
ఒబెడా ఆర్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ 2 ఎంజీ, 4ఎంజీ మోతాదుల్లో లభించనున్నది. ఇది సులభమైన పెన్ పరికరంతో వారానికి ఒకసారి చర్మం కింద ఇచ్చేందుకు వీలుగా దీనిని తయారు చేసింది. రెండు మోతాదుల్లోని ప్రతి పెన్ కనీసం వారానికి 4 డోసుల మోతాదుల్లో లభించనున్నది. రెండు మోతాదులకు రోగికి అయ్యే ఖర్చు నెలకు రూ.4,200.