న్యూఢిల్లీ, ఆగస్టు 12: ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థయైన హీరో మోటోకార్ప్ లాభాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.585.58 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.256.46 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. కంపెనీ విక్రయాలు భారీగా పెరగడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని పేర్కొం ది. ఏడాది క్రితం రూ.5,502.80 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ. 8,447.54 కోట్లకు చేరుకున్నది.