Ola vs TVS | పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో కస్టమర్లు ఆల్టర్నేటివ్ ఫ్యుయల్ వైపు మళ్లుతున్నారు. అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై మోజు పెంచుకుంటున్నారు. రోజురోజుకి వీటికి గిరాకీ పెరుగుతున్నది. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థల మధ్య పోటీ పెరిగింది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌లో ప్రస్తుతానికి తొలి స్థానంలో కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్‌కు టీవీఎస్ మోటార్స్ గట్టి పోటీ ఇవ్వనున్నదని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ నొమురా పేర్కొంది.
గతేడాది ఎలక్ట్రిక్ వెహికిల్స్ సేల్స్‌లో హీరో ఎలక్ట్రిక్ 7357 యూనిట్లతో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానంలో 5900, ఆంపేర్ 4300, ఓలా 3000, టీవీఎస్ 2238 వెహికల్స్ విక్రయించింది. 2022తో పోలిస్తే ఈ ఏడాది చాలా మార్పు వచ్చింది. గత నెలలో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్‌లో ఓలా ఎలక్ట్రిక్ మొదటి స్థానానికి దూసుకొచ్చిందని నొమురా అభిప్రాయ పడింది. గత నెలలో ఓలా 17,600 వాహనాలు విక్రయిస్తే, టీవీఎస్ 12600, ఎథేర్ 10 వేలు, హీరో ఎలక్ట్రిక్ 5900, ఒకినావా 3800 వెహికల్స్ విక్రయించాయని తెలిపింది.
ఫిబ్రవరిలో టీవీఎస్ వెహికల్స్ భారీగా పెరిగాయని నొమురా గుర్తు చేసింది. గతేడాది 17,600 వెహికల్స్ విక్రయించిన ఓలాకు టీవీఎస్ నుంచి గట్టి పోటీ ఎదురు కావచ్చునని అభిప్రాయ పడింది. ఇప్పుడు ఓలా ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ పేరుతో వివిధ బ్యాటరీ వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరోవైపు టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లు మూడు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చాయి.