చెన్నై, మే 20: ద్వి, త్రిచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటర్ కంపెనీ..దేశీయ మార్కెట్‌కు మరో ఎలక్ట్రిక్ ఆటోను పరిచయం చేసింది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో విడుదల చేసిన ఈ ఆటో ధర రూ.2.95 లక్షలుగా నిర్ణయించింది. సింగిల్ చార్జింగ్‌తో 179 కిలోమీటర్లు ప్రయాణించే ఈ ఆటో బ్యాటరీ కేవలం 2.15 గంటల్లోనే 80 శాతం రీచార్జికానున్నది.
టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్, నావిగేషన్, అలర్ట్స్, 51.2 వోల్ట్ల లిథియం అయాన్ బ్యాటరీ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దిన ఈ ఆటో గంటకు 60 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ వాహనంపై ఆరేండ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ సదుపాయం కూడా సంస్థ కల్పిస్తున్నది.