న్యూఢిల్లీ : దేశీ మార్కెట్లో టీవీఎస్ అపాచీ 2021 ఆర్ఆర్310ను లాంఛ్ చేసింది. గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఈ ఎడిషన్‌కు మార్పులు చేసి అదనపు ఫీచర్లతో భారత రోడ్లపైకి సరికొత్త బైక్‌ను టీవీఎస్ ప్రవేశపెట్టింది. దేశంలో హెవీ ట్రాఫిక్‌కు అనుగుణంగా ఆర్ఆర్310కు మార్పులు జోడించిన టీవీఎస్ కొత్త బైక్ ధరను రూ 2.59 లక్షలుగా (ఎక్స్ షోరూం, ఢిల్లీ) నిర్ధారించింది.
కంపెనీ బీటీఓ (బిల్ట్ టూ ఆర్డర్) ప్లాట్‌ఫాంపై అందుబాటులో ఉండే న్యూ ఆర్ఆర్310ను వివిధ పెర్ఫామెన్స్ కిట్స్, ఇతర కస్టమైజేషన్ ఆప్షన్స్‌తో కస్టమర్లు పొందే వెసులుబాటు కల్పించారు.
ఈ ప్లాట్‌ఫాం ఆర్డర్ల రియల్‌టైం ట్రాకింగ్కూ అనుమతిస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 అంతకుముందు మోడల్లాగే కనిపించినా తాజాగా టీవీఎస్ రేసింగ్ బ్యాడ్జ్ ఆప్షన్‌ను కలిగిఉంది. రెడ్, బ్లూ, వైట్ కలర్స్‌లో న్యూ బైక్ కస్టమర్లకు అందుబాటులో ఉంది.
మెరుగుపరిచిన ఎగ్జాస్ట్ నోట్, బెటర్ లీన్ యాంగిల్స్, న్యూ రేస్ మఫ్లర్ వంటి ప్రత్యేకతలను కలిగిఉంది. డైనమిక్, రేస్ వంటి రెండు పెర్ఫామెన్స్ కిట్స్‌తో న్యూ ఆర్ఆర్310 అందుబాటులో ఉంది.