చెన్నై, ఫిబ్రవరి 18: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటర్..దేశీయ మార్కెట్‌కు మరో వాహనాన్ని పరిచయం చేసింది. 2025 ఎడిషన్‌గా విడుదల చేసిన 225 సీసీ మోటర్‌సైకిల్ ‘రోనిన్’లో భద్రత ఫీచర్లను అప్‌గ్రేడ్ చేసింది. రెండు రంగుల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ.1.35 లక్షలుగా నిర్ణయించింది. డ్యూయల్ చానెల్ ఏబీఎస్ రకం మాడల్ రూ.1.59 లక్షలు. ఈ ధరలు చెన్నై షోరూంనకు సంబంధించినవి. 225.9 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బైకు 20.4 పీఎస్‌ల శక్తినివ్వనన్నది. టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేసిన సంస్థ..ఈ బైకును యువతకు నచ్చే విధంగా డిజైన్ చేసినట్లు వెల్లడించింది. స్టైలిష్, రైడింగ్ పరంగా కొన్ని మార్పులు చేసినట్టు కంపెనీ పేర్కొన్నది. ఈ మాడల్‌తో సేల్స్ పెరుగు తాయన్న ఆశాభావాన్ని సంస్థ కనబరుస్తున్నది.