Advertisements | గత మూడేళ్లలో ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్‌లో అసభ్యకరమైన, అభ్యంతరకమైన ప్రకటనలపై 73 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆయా ఫిర్యాదుల మూడంచెల వ్యవస్థ ద్వారా పరిష్కరించినట్లు తెలిపారు. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (సవరణ) నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన యంత్రాంగంలో ప్రసారకర్తల స్వీయ నియంత్రణ, ప్రసారకుల స్వీయ నియంత్రణ సంస్థల స్వీయ నియంత్రణ.. కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ వ్యవస్థ వంటివి ఉన్నాయని మురుగన్ పేర్కొన్నారు.
అడ్వర్టయిజ్మెంట్ కోడ్ ఉల్లంఘనలు ఎక్కడ కనిపించినా అడ్వైజ్, వార్నింగ్, అపాలజీ ఆర్డర్, ఏయిర్ ఆర్డర్ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మరో ప్రత్యేక ప్రశ్నకు బదులిచారు. ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ ఐటీ రూల్స్, 2021లోని పార్ట్-III ప్రకారం ప్రవర్తనా నియమావళిని అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చట్టం ద్వారా నిషేధించిన కంటెంట్‌ను ఎవరూ ప్రసారం చేయరని.. నిబంధనల్లో ఇచ్చిన సాధారణ మార్గదర్శకాల ఆధారంగా కంటెంట్‌ని ఐదువర్గాలుగా వయసు ఆధారిత స్వీయ వర్గీకరణ చేయాల్సి ఉంటుందన్నారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు పిల్లలకు వయసుతో సరిపడని కంటెంట్‌ని పరిమితం చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాయని కూడా ఈ కోడ్ చెబుతోందని మురుగన్ పేర్కొన్నారు.