న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శి తుహిన్ కాంత పాండేను స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మాధాబి పూరి బచ్ శుక్రవారంతో తన పదవికాలం ముగియనుండటంతో ఆమె స్థానాన్ని పాండేతో భర్తి చేసింది.
ప్రధాని అధ్యక్షతన అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ సమావేశమై ఈ నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగనున్నారు.